నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న అమెజాన్ ప్రైమ్.. ఏకంగా బాలీవుడ్ మూవీతోనే

by Shyam |   ( Updated:2021-03-17 04:19:17.0  )
నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న అమెజాన్ ప్రైమ్.. ఏకంగా బాలీవుడ్ మూవీతోనే
X

దిశ,వెబ్ డెస్క్:ప్రసుతం సినీ పరిశ్రమ డిజిటల్ రంగం వైపే అడుగువేస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ సినిమాలను చూడడానికి అవకాశం కల్పిస్తున్నాయి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్. ఇక ఈ ప్లాట్ ఫార్మ్స్ లో అగ్రగామిగా వెలుగుగొందుతున్న ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో. వరుస హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘రామ్ సేతు’ చిత్ర నిర్మాణంలో అమెజాన్ ప్రైమ్ వీడియో భాగస్వామి అయినట్లు అధికారికంగా ప్రకటించింది. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఫ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబండంటియా ఎంటర్టైన్మెంట్స్ తో పాటు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

భారతీయ సంస్కృతీ మరియు చారిత్రక మూలాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ యాక్షన్ అడ్వెంచర్ లో అక్షయ్ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ని మార్చి 18 న అయోధ్యలో ప్రారంభించనున్నారు. మరి డిజిటల్ రంగంలో అగ్రస్థానాన్ని అధిరోహించిన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోనూ విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

https://twitter.com/PrimeVideoIN/status/1372102924411625472

Advertisement

Next Story