- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెజాన్ మిస్టేక్.. లక్ష రూపాయల ఏసీ 5 వేలకే!
దిశ, ఫీచర్స్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ మార్కెట్స్‌లో మనకు ఏదైనా వస్తువు నచ్చితే ఈ కామర్స్ సంస్థ.. దానిపై ఎప్పుడు ఆఫర్ ప్రకటిస్తుందా? అని రెగ్యులర్‌గా వాచ్ చేస్తుంటాం. అవసరం లేని వస్తువుకైనా డిస్కౌంట్ ప్రకటిస్తే వెంటనే కొనుగోలు చేసేస్తాం. అలాంటిది లక్ష రూపాయల విలువైన ఏసీ 94% తగ్గింపు ధరకు వస్తుందంటే ఎగిరి గంతేస్తాం కదా. ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ఇండియా ఏసీ ప్రైస్ లిస్టింగ్‌లో చేసిన పొరపాటు కారణంగా ఈ భారీ ఆఫర్ డిస్‌ప్లే కాగా.. కస్టమర్లకు వరంగా మారింది.
అమెజాన్ ఇండియా.. తోషిబా 2021 రేంజ్ స్ప్లిట్ సిస్టమ్ ఏసీని రూ.5900/- ప్రైస్ ట్యాగ్‌తో లిస్టింగ్ చేసింది. కస్టమర్లకు ఇది నమ్మశక్యంకాని ఆఫర్‌గా అనే చెప్పొచ్చు. ఎందుకంటే దాని అసలు ధర రూ. 96,700/-. అయితే ఈ ఏసీని రూ.5900 డిస్కౌంట్‌తో రూ. 90,800కు విక్రయించాలనుకున్న అమెజాన్.. పొరపాటున ఆఫర్‌తో కలిపి ధర రూ. 5900/-గా నిర్ణయించింది. ఈ విషయం తెలిసి చాలా మంది కస్టమర్స్ వెంటనే బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత మిస్టేక్ తెలుసుకున్న అమెజాన్.. ధరతో పాటు ఆఫర్‌ను సవరించింది. కాగా ఇప్పటికే ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు ఫుల్ అమౌంట్ చార్జ్ చేసిందా? లేదా బుక్ చేసుకున్న ధరకే డెలివరీ చేసిందా? తెలియాల్సి ఉంది. అయితే అమెజాన్, ఇలాంటి పొరపాటు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2019లోనూ లక్షల విలువచేసే కెమెరా గేర్‌ను ప్రైమ్ డే సేల్ కింద రూ. 6500కే విక్రయించింది.