Amazon బంపర్ ఆఫర్: రూ.20,999ల Samsung ఫోన్ రూ.1,199లకే!

by Harish |
Amazon bumper offer
X

దిశ, డైనమిక్ బ్యూరో : పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ భారీగా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇలాంటి ఆఫర్లతో పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించే ఆన్‌లైన్ సైట్లు (online shopping websites), ఇప్పుడు దీపావళి ఆఫర్లు (Diwali offer)ప్రకటించాయి. దసరా కంటే మరింత మార్కెట్ సాధనే ధ్యేయంగా అమెజాన్(Amazon), ఫ్లిప్‌కార్ట్ (flipkart) సైట్లు మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది. త్వరలోనే అమెజాన్‌ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ముగియనుండటంతో ఆఫర్లు మరింత పెంచింది.

ఈక్రమంలో స్మార్ట్‌ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు ఇచ్చి ఏకంగా రూ.20,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,199 ధరకే ఇవ్వనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.20,999 విలువచేసే శామ్సంగ్ (Samsung) గెలాక్సీ ఎం32 5జీ ఫోన్ పై అదిరిపోయే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ తీసుకొచ్చింది. ఎంతలా అంటే, మీ ఓల్డ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌లో రూ.15,800 విలువ చేస్తే చాలు.. రూ.1,199లకే కొత్త ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ విలువ తక్కువగా ఉంటే మిగతా మొత్తం చెల్లించి మొబైల్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, రూ.1,199లకే మొబైల్ పొందాలంటే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తోపాటు క్రెడిట్, డెబిట్ కార్డులు అందించే 10 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను కూడా వినియోగించాల్సిందే.

Advertisement

Next Story