బోల్డ్ కంటెంట్‌తో అమలా పాల్ సిరీస్

by Anukaran |   ( Updated:2020-08-10 02:22:30.0  )
బోల్డ్ కంటెంట్‌తో అమలా పాల్ సిరీస్
X

అమలా పాల్.. తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్. కెరియర్ స్టార్టింగ్‌లో గ్లామర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న అమల.. పెళ్లి, విడాకుల తర్వాత ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ‘ఆమె’ సినిమాతో వచ్చేసిన అమలా పాల్.. ముందుగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ తర్వాత తన నటనతో ప్రశంసలు అందుకుంది. అయితే ఈ భామ ఓ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మహేష్ భట్, జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ను లాక్ డౌన్‌కు ముందే అధికారికంగా ప్రకటించారు. హిందీలో రూపుదిద్దుకుంటున్న ఈ సిరీస్ బోల్డ్ కంటెంట్‌తో కూడుకుందని సమాచారం.

ఓ తమిళ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్.. 1970 బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న వెబ్ సిరీస్‌ల మాదిరిగానే బోల్డ్ కంటెంట్‌తో వస్తుండటంతో అమలా పాల్‌కు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని అంటున్నారు. విడాకుల తర్వాత మరింత స్పీడ్ పెంచిన అమల.. సోషల్ మీడియాలోనూ హాట్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Advertisement

Next Story