- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టిక్‌టాక్‌ను షేక్ చేస్తున్న బన్నీ సాంగ్…
సంక్రాంతికి విడుదలైన అలవైకుంఠపురంలో చిత్రం బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. బన్నీ కేరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిపెట్టిన సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంలో పాటల పాత్ర అమోఘమని చెప్పాలి. ఇప్పటికి ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో మారుమోగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ సినిమాలోని ‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే… జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే’ అంటూ సాగే మెలోడీ సాంగ్ క్లాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీ ఈ పాటలో వేసిన స్టెప్స్‌ను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా అనుసరించడం విశేషం. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ ఆలపించాడు. ఇప్పుడు ఈ సాంగ్ టిక్ టాక్‌ను షేక్ చస్తోంది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ ను టిక్ టాక్ చేశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ ను టిక్ టాక్ చేసి చేసింది, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాంగ్ ఎంతటి పావులర్ అయ్యిందో. దీంతో అల్లూ అర్జున్ డాన్స్‌స్టెప్స్‌కు పాన్ ఇండియాలో యమా క్రేజ్ వచ్చింది. బుట్టబొమ్మ సాంగ్ కి టిక్ టాక్ లో దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన అలవైకుంఠపురంలో సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.