- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బన్నీ, అర్హాల క్యూటెస్ట్ వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు కూతురు అల్లు అర్హా అంటే ఎంతిష్టమో దాదాపు అందరికీ తెలుసు. ఇప్పటి వరకు కూతురు చేసిన అల్లరిని వీడియో రూపంలో రిలీజ్ చేయగా… సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఇంతకు ముందు ‘నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోమ్మాఅంటే నేను చేసుకోను అంటూ’ అర్హా చేసిన అల్లరికి ఫిదా అయిపోయారు జనాలు. ఆ తర్వాత ‘అల వైకుంఠపురంలో’ సినిమా టైంలో రాములో రాములా సాంగ్ స్టెప్స్‌ను అర్హా ఎలా కామెంట్ చేస్తుందో చూపిస్తూ మరో వీడియో తీశాడు బన్నీ. రాములో రాములా సాంగ్‌లో డాడి వేసిన స్టెప్పు ఏంటి? అని బన్నీ అడిగితే… దోసా స్టెప్ అంటూ అర్హా చెప్పిన విధానానికి .. ప్రెట్టీనెస్‌తో నిండిపోయిన వీడియోకు పడిపోయారు జనాలు. హాఫ్ కోట్ స్టెప్‌ను దోసా స్టెప్ అని కూతురు చెప్తే మురిసిపోయాడు అల్లు అర్జున్.
కాగా ఇప్పుడు మరో వీడియో రిలీజ్ చేశాడు బన్నీ. కూతురు తనను బే అంటుందంటూ ఫ్యాన్స్‌కు చెప్తూ ఓ వీడియో షూట్ చేసిన బన్నీ… ఫాదర్ డాటర్ లవ్ అంటూ పోస్ట్ పెట్టాడు. వీడియోలో ఫేవరేట్ కలర్ ఏంటి బే? అని కూతురిని బన్నీ అడిగితే … పింక్ కలర్ బే అంటుంది అర్హా. నన్ను బే అంటావా బే అంటే.. అవును బే అంటూ అర్హా క్యూట్ స్మైల్‌తో చెప్పగా … సొంత డాడిని .. ఓన్ ఫాదర్‌ని.. కన్న తండ్రిని బే అంటావా బే … అంటూ తండ్రీ కూతుళ్లు చేసిన అల్లరి ఇప్పుడు వైరల్ అయింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.