- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రిన్స్ చేతుల మీదుగా ‘నాంది’ ట్రైలర్.. ఇంటెన్స్ లుక్‌లో నరేష్
దిశ, సినిమా: హాస్యాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో ‘అల్లరి’ నరేష్.. గతంలో పలు ప్రయోగాత్మక చిత్రాలతోనూ మెప్పించిన విషయం తెలిసిందే. అయితే కొంతకాలంగా సక్సెస్ రుచి చవిచూడని నరేష్.. కామెడీ ఫార్ములాను వదిలిపెట్టి నటనా ప్రాధాన్యమున్న చిత్రాలపై ఇంటరెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘మహర్షి’ చిత్రంలో కీ రోల్ ప్లే చేసి ప్రశంసలు అందుకున్న అల్లరోడు.. ప్రస్తుతం విజయ్ కనక మేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాంది’ చిత్రంలో సీరియస్ పాత్ర పోషిస్తున్నారు. తను ఎందుకు శిక్ష అనుభవిస్తున్నాడో తెలియని పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తుండగా.. మూవీ ట్రైలర్‌ను ప్రిన్స్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపిన మహేశ్.. మూవీ బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షించారు. ఇక ట్రైలర్‌లో లాయర్‌గా నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఖైదీగా నరేష్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు.