- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ జిల్లాలోని పల్లెలన్నీ మంచు మయం..
by Shyam |

X
దిశ కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అటవీ మండలాల్లో బుధవారం మంచు దుప్పటి కప్పేసింది. శీతాకాలం కావడంతో పాటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆకాశం మేఘావృతమై పల్లెలన్నింటినీ మంచు దుప్పటి కప్పేసింది. బుధవారం ఉదయం అడవులతో పాటు గ్రామాలలో వీధులన్నీ మంచుతో నిండి పోయాయి. ఉదయం 8:00 అయినా మంచు తెరలు తొలగలేదు. మంగళవారం రాత్రి అంతా మంచు విపరీతంగా పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొగమంచుతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ఉదయంపూట వాహనదారులు లైట్లు వేసుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించారు. తెల్లవారుజామున అడుగు దూరంలో ఉన్న మనుషులు సైతం ఒకరికొకరు కనిపించని రీతిలో మంచు కమ్ముకున్నది. అంతట మంచు కనిపిస్తుండడంతో ప్రజలు పిల్లలు పెద్దలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాధించారు.
Next Story