ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాకు అమిత్ షా హామీ!

by Anukaran |   ( Updated:2021-06-24 08:27:38.0  )
ముగిసిన ఆల్ పార్టీ మీటింగ్.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర హోదాకు అమిత్ షా హామీ!
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాని మోడీ అధ్యక్షతన ఆయన నివాసంలో జమ్మూకశ్మీర్ నేతలతో గురువారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా సాగిన మీటింగ్‌లో పలు కీలక అంశాలపై చర్చించినట్లు కాంగ్రెస్ సీనియర్ లీడర్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులామ్ నబీ ఆజాద్ జాతీయ మీడియాకు వివరించారు. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన సమావేశంలో డీలిమిటేషన్‌పై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని ప్రధాని మోడీ సూచించినట్టు తెలిపారు.

డీలిమిటేషన్ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహిస్తామని మోడీ చెప్పారని ఆజాద్ చెప్పుకొచ్చారు. అయితే, ప్రధాని ఎదుట తాము ప్రధానంగా ఐదు డిమాండ్లు ఉంచామని, కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని ఆజాద్ వెల్లడించారు. అదేవిధంగా నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై ప్రధాని మోడీ ఎలాంటి కాలపరిమితి పెట్టలేదన్నారు. ఇకపోతే మోడీతో సమావేశం సుహృద్భావంగా సాగిందని కశ్మీర్ నేతలు తెలిపారు. కాగా, ఈ సమావేశానికి 8 పార్టీలకు చెందిన 14 మంది నేతలు హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed