- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీసీసీఐకి ఆకాశవాణి లేఖ
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13వ సీజన్ మ్యాచ్‌లకు సంబంధించిన కామెంట్రీని రేడియోలో ప్రసారం చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి) బీసీసీఐని కోరింది. ఈ మేరకు ప్రసారభారతి సీఈవో శశి వెంపటి బోర్డుకు లేఖ రాసినట్టు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు. ‘రేడియో కామెంట్రీ అనుమతి కోరుతూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాశాం. ఇప్పటికే టీమ్ ఇండియా మ్యాచ్‌లకు కామెంట్రీ హక్కులు కలిగి ఉన్నాం.
ప్రస్తుతం కోవిడ్-19 నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. టీవీలు లేని క్రికెట్ ప్రేమికులకు రేడియో మంచి ప్రత్యామ్నయం. కాబట్టి తాను ఈ ప్రతిపాదన చేశాం’ అని శశి తెలిపారు. గత ఏడాది టీమ్ ఇండియా ఆడే అన్ని మ్యాచ్‌ల లైవ్ కామెంట్రీ అందించడానికి బీసీసీఐ, ప్రసారభారతి మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ యూఏఈలో ఉన్నారు. ఐపీఎల్ ఒప్పందం కుదుర్చుకోవడానికి వారం రోజుల సమయమే ఉండటంతో ఈ సీజన్‌లో ఈ ఒప్పందం అమలులోకి వస్తుందనేది అనుమానంగా మారింది.