పోలీసులతో హోం మంత్రి మహమూద్ అలీ కీలక భేటీ

by Shyam |
Minister Mahmood Ali
X

దిశ, తెలంగాణ బ్యూరో : బోనాలు, బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ లోని మంత్రి కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. బోనాలు, బక్రీద్ ను పురస్కరించుకొని బందోబస్తు, శాంతి భద్రతల ఏర్పాట్లు, హోంశాఖ పరిధిలోని విభాగాల్లో వివిధ పోస్టుల ఖాళీలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్సవాల్లో పాల్గొంటున్న ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బక్రీద్‌ను పురస్కరించుకోని ఆవులను బలివ్వకుండా చూడాలని ముస్లిం పెద్దలను కోరారు. హోంశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను వెంటనే అప్ డేట్ చేయాలని, ఖాళీ పోస్టులపై స్పష్టత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి, జైళ్ల డీజీ రాజీవ్ త్రివేది, ఆర్గనైజేషన్ ఏడీజీ రాజీవ్ రతన్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed