- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ గురించి కొన్ని తెలియని విషయాలు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని వివిధ ప్రాంతాలకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగించిన నేపథ్యంలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చే ఉద్దేశంతో శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ పేరుతో వీటిని మొదలుపెట్టింది. వీటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం…
1. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల కోరిక మేరకు కేంద్రం ఈ ఏర్పాట్లు చేసింది.
2. రోజూ నడవనున్న ఈ రైళ్ల సంఖ్య నెమ్మదిగా పెంచుతామని రైల్వే అధికారులు చెప్పారు. శుక్రవారం 5, శనివారం 10 రైళ్లు నడిచాయి. స్క్రీనింగ్ ప్రాసెస్ తప్పనిసరి కావడంతో కొద్దిగా ఇబ్బందులు పెరుగుతున్నాయి.
3. ఈ రైళ్లకు 24 కోచ్‌లు ఉన్నాయి. ఒక్కో దాంట్లో 72 మంది కూర్చోవచ్చు. కానీ సామాజిక దూరం కారణంగా 54 మందిని మాత్రం అనుమతిస్తున్నారు. అలాగే ఒక్క రైళ్లో గరిష్టంగా 1200 మాత్రమే ఉండాలి.
4. ఇందులో ప్రయాణించి వారి నుంచి చార్జీలు తీసుకోవాలని రైల్వే, రాష్ట్రాలకు సూచించింది. రెగ్యులర్ స్లీపర్ క్లాస్ చార్జీతో పాటు రూ. 30 సూపర్ ఫాస్ట్ చార్జీ, రూ. 20 అదనపు చార్జీని వసూలు చేయనున్నారు. ప్రయాణీకుల తరఫున రాష్ట్రాలు చార్జీల డబ్బు చెల్లించవచ్చని రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పింది.
5. 12 గంటలకు ఎక్కువ ప్రయాణం ఉన్నప్పటికీ తాము ఒక్కసారే ఆహారం అందించగలమని రైల్వే చెప్పింది. ప్రారంభ స్థానాల్లో రాష్ట్రాల్లో భోజనం, నీళ్ల సంగతి చూడాలని సూచించింది.
6. కొవిడ్ 19 బారిన తీవ్రంగా ప్రభావితమైన ముంబై నుంచి వీటిని నడిపించడం లేదు. బదులుగా మహారాష్ట్రలోని భీమండి, వసాయ్ నుంచి నడుపుతున్నారు.
7. ఈ రైళ్ల దారి గురించి రైల్వే ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం ప్రారంభస్థానం, గమ్యస్థానం వివరాలు మాత్రమే వెల్లడించాయి.
8. ఎక్కువ రైళ్లను కోరిన రాష్ట్రాల్లో జార్ఖండ్ ముందు స్థానంలో ఉంది. మొత్తం 31 రైళ్లకు ఈ రాష్ట్రం ముందే డబ్బు చెల్లించినట్లు సమాచారం.
9. ఈ చిన్న సమస్య వచ్చినా… ఈ రైళ్లను ఎక్కడిక్కడే నిలిపివేసే హక్కు రైల్వే మంత్రిత్వ శాఖకు ఉంది.
Tags – railways, covid, corona, status, shramik express, jharkhand, telangana, mumbai