‘ఆలియా, రణ్‌బీర్ ఎంగేజ్‌మెంట్‌’.. రణ్‌ధీర్ క్లారిటీ

by Shyam |
‘ఆలియా, రణ్‌బీర్ ఎంగేజ్‌మెంట్‌’.. రణ్‌ధీర్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌ల నిశ్చితార్థం రాజస్థాన్‌లోని రణతంబోర్‌లో జరుగుతుందన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు రణ్‌ధీర్ కపూర్. డిసెంబర్ 30న ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని, అందుకే ఆప్తమిత్రులు అందరూ రాజస్థాన్ చేరుకుంటున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఇదంతా ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు రణ్‌బీర్ బాబాయి రణ్‌ధీర్ కపూర్. ఒకవేళ నిశ్చితార్థం జరిగే చాన్స్ ఉంటే తామంతా కూడా ఈ టైమ్‌కు అక్కడ ఉండేవాళ్లమన్నారు. రణ్‌బీర్, ఆలియా.. నీతూ కపూర్‌, రిద్దిమా కపూర్‌తో కలిసి వెకేషన్‌కు మాత్రమే వెళ్లారని.. న్యూ ఇయర్ పార్టీ అక్కడే జరుపుకుంటారని తెలిపారు.

కాగా రణ్‌బీర్ కపూర్ కొద్ది రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో త్వరలోనే పెళ్లికి టిక్ మార్క్ వేస్తామని ప్రకటించారు. కరోనా లేకపోయి ఉంటే ఇప్పటికే ఆలియాతో పెళ్లి కూడా జరిగిపోయేదన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్‌కు వెళ్లడంతో నిశ్చితార్థం అనే ఫేక్ న్యూస్ వేగంగా స్ప్రెడ్ అయిపోయింది. కాగా 2017 నుంచి వీరు డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం కాగా.. 2018లో సోనమ్ కపూర్ పెళ్లిలో ఆలియా, రణ్‌బీర్‌ల రిలేషన్‌షిప్ కన్‌ఫర్మ్ అయిపోయింది. అప్పటి నుంచి తరచూ జంటగా కనిపిస్తూ మీడియాకు పోజ్‌లిస్తుండగా.. చాలాసార్లు వీరి మ్యారేజ్ జరిగిందంటూ న్యూస్ వచ్చింది.

Advertisement

Next Story