- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళమ్మను మెప్పించిన దివ్యాంగుడు..
పుట్టుకతో పోలియో బారిన మహ్మద్ నూర్ అలీ ఖాన్ తన వైకల్యాన్ని జయించాడు. రెండు కాళ్లు పనిచేయకపోయినా తల్లిదండ్రులు తమ బాధను దిగమింగి తన కొడుకును పెంచి పెద్ద చేశారు. అలీ కూడా తన వైకల్యాన్ని తలుచుకుంటూ డిప్రెషన్‌కు లోనవలేదు. పట్టుదలతో చదివి ఇంటర్ పూర్తి చేశాడు. కాగా, నూర్ అలీ ఖాన్ చిన్నప్పటి నుండి అద్దం ముందు కూర్చుని సినీ నటీ నటులను అనుసరిస్తూ మిమిక్రీ చేసేవాడు. కానీ అదే తన జీవితం అవుతుందని ఎప్పుడు అనుకోలేదని చెప్పుకొచ్చాడు. తనకున్న టాలెంట్‌తోనే కళమ్మను మెప్పించి తన కాళ్లపై లేచి నిల్చున్నాడు. ఆయన టాలెంట్ గూర్చి తెలుసుకున్న ఓ అర్కెస్ట్రా గ్రూపు తమతో కలిసి పనిచేయాలని కోరింది. దీంతో అందులో చేరి ఆ గ్రూపు ద్వారా ప్రదర్శనలు ఇస్తూ, పాటలు పాడడం డ్యాన్స్ చేయడం కూడా నేర్చుకున్నారు. ఆ తరువాత మథర్ థెరిస్సా వికలాంగుల అర్కెస్ట్రా సంస్ఖను ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇవ్వడం ఆరంభించాడు. తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. అంతేకాకుండా తాను సంపాదించిన మొత్తంలో కొంత సామాజిక సేవ చేయాలన్నఉద్దేశ్యంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. గుంటూరుకు చెందిన ఈయన ఇప్పటి వరకు 700లకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అలా ప్రదర్శనలు ఇస్తూనేఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తన కళతో కరీంనగర్ వాసులను కట్టిపడేస్తున్న ఆయన తనకు వచ్చిన ఆదాయంలో కొంత సేవ ద్వారా వెచ్చించాలని నిర్ణయించారు. కరీంనగర్ లోని అమ్మ ఒడి వృద్దాశ్రమానికి తన టీంతో మంగళవారం చేరుకున్నారు. ఆశ్రమంలోని వృద్ధుల కోసం ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయించగా, ఆయన స్వయంగా వంట చేసి పాటు వృద్ధులకు భోజనాలు కూడా వడ్డించారు. పుట్టుకతో దివ్యాంగుడైన నూర్ అలీ ఖాన్ మానసికంగా కుంగిపోకుండా తన కళతో అందరి మనస్సులో స్థానం సంపాందించుకుంటున్నాడు. మరో వైపున సంపాదించిన దానిని దాచుకోకుండా కొంతమేర సామాజిక సేవకు వినియోగించడం అలీ గొప్ప మనస్సును చాటుతోందని పలువురు చెబుతున్నారు.