చెట్టెక్కిచ్చిన కరోనా

by  |
చెట్టెక్కిచ్చిన కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ‘వదలను బొమ్మాలి నిన్ను వదలా’ అని కామన్ మ్యాన్ నుంచి దేశాధ్యక్షుడి వరకు అందరిని అంటుకుంటోంది. వైరస్ కు భయపడి ప్రజలు కొందరు పూజలు, యాగాలు చేస్తుండగా.. మరి కొందరు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరందరికి భిన్నంగా బెంగులూరులో ఓ యువకుడు చేసిన పనికి అక్కడి ప్రజలతోపాటు, పోలీసులు ఖంగుతిన్నారు.

బెంగుళూరులోని గుల్బ‌ర్గా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ కాలేజీ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి పీక‌ల దాకా మ‌ద్యం సేవించి, తనకు వైరస్ వ్యాపించకుండ ఉండాలని సమీపంలోని చెట్టెక్కి ప‌డుకున్నాడు. సోమవారం ఉదయం అత‌న్ని గ‌మ‌నించిన స్థానికులు.. లేపే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆ వ్యక్తిలో ఎలాంటి చలనం లేకపోవడంతో వారు ఆందోళ‌న‌కు గురై పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు. మరో ఇద్ద‌రిని చెట్టుపైకి ఎక్కించి పరిశీలించినా అతడిలో ఉలుకు, పలుకు లేకపోవడంతో పోలీసులు ఆ వ్య‌క్తి చ‌నిపోయి ఉంటాడ‌ని భావించారు. కానీ కొద్ది సమయం తర్వాత చెట్టెక్కిన ఇద్ద‌రు వ్య‌క్తులు.. అత‌ను బ‌తికే ఉన్నాడ‌ని నిర్ధారించారు. అతని దుస్తులు తనిఖీ చేయగా మ‌ద్యం బాటిళ్లు లభ్యం అయ్యాయి. అతడిని చెట్టు పైనుంచి కింద‌కు దింపిన పోలీసులు పైన ఎందుకు పడుకున్నావని ప్ర‌శ్నించారు. ఈ మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా కేసులు ఉన్నందున.. ఆ భ‌యంతో చెట్టెక్కి ప‌డుకున్నాన‌ని చెప్ప‌డంతో పోలీసులు విస్తుపోయారు. క‌రోనా నుంచి ప్రాణాల‌ను కాపాడుకునేందుకు చెట్టెక్కి గాఢ నిద్ర‌లోకి జారుకున్నాన‌ని పోలీసుల‌కు తెలిపాడు. ఏదిఏమైనా కరోనా వైరస్ ప్రజలను కంటిమీద కునుకు లేకుండ చేస్తుందనడంలో సందేహం లేదు.

Next Story

Most Viewed