- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్కహాల్ రహిత వైన్.. కానీ అదే ఫీలింగ్, అంతే కిక్!
దిశ, ఫీచర్స్: రోజంతా పని ఒత్తిడితో అలిసిపోయినవారిలో చాలామంది సాయంత్రానికి ఒక గ్లాస్ వైన్‌తో సేదతీరుంటారు. అయితే ఆల్కహాల్ వినియోగం కొందరికి కోపాన్ని కలిగిస్తే.. మరికొందరు మాత్రం వైన్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. ఇందులో ఏది నిజమనే సంగతి పక్కనబెడితే.. వైన్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ ఆల్కహాల్ రహిత వైన్ ద్వారా కూడా పొందవచ్చని కొత్త అధ్యయనం పేర్కొంది.
అంగ్లియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రుడాల్ఫ్ షట్ రిపోర్ట్ ప్రకారం.. పరిమిత వైన్ వినియోగం గుండెపోటు సమస్యను తగ్గించి, రక్షణ కల్పిస్తుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది ఇతరత్రా హృదయ సంబంధ వ్యాధులకు వర్తించదు. వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్ల రూపంలోని పాలీఫెనాల్స్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని దాదాపు ఏడేళ్లపాటు 446,439 మంది వ్యక్తుల నుండి సేకరించిన డేటా విశ్లేషణ ద్వారా తెలుసుకున్నారు పరిశోధకులు. అసలే తాగనివారు, అతిగా తాగేవారితో పోలిస్తే వారానికి 11 గ్లాసుల వైన్ సేవించేవారిలో కరోనరీ హార్ట్ డిసీజెస్ ప్రమాదం తక్కువని తేలింది. కాగా నాన్ ఆల్కహాలిక్ వెర్షన్స్‌ను రెగ్యులర్‌గా తాగేవారిలోనూ ఇవే ఫలితాలు కనుగొనబడ్డాయి. ఇదే సమయంలో పరిమితంగా బీర్, సైడర్ లేదా స్పిరిట్స్ తాగడం వల్ల ఆరోగ్యంపై 10 శాతం రిస్క్ చూపే ప్రమాదముందని స్పష్టం చేసింది.