- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త టెక్నిక్.. నెలసరి వాయిదాల్లో మద్యం కొనొచ్చంట!
దిశ, న్యూస్‌బ్యూరో : ఇకపై నెలసరి వాయిదాల్లో మద్యం కొనుక్కోవచ్చు. ఇప్పటి వరకు స్వర్గధామంగా విరాజిల్లిన తెలంగాణ లిక్కర్ మార్కెట్ కరోనాతో కుదేలైంది. లాక్‌డౌన్ సడలింపులిచ్చిన మే 6వ తేదీ తర్వాత రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. వారంపాటు జోరుగా సాగిన అమ్మకాలు ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో రూ. కోట్లు లైసెన్సు ఫీజులు చెల్లించి షాపులు తీసుకున్న రిటైలర్లు అగమ్యగోచరంలో పడ్డారు. అమ్మకాలను పూర్వపు స్థితికి తీసుకురావడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఇక లాభం లేదనుకున్నారో ఏమో లిక్కర్ ఫుల్ బాటిళ్లను ఏకంగా వాయిదాల పద్ధతి మీద అమ్మడం ప్రారంభించారు.
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత షాపులు తెరచుకున్నప్పటి నుంచి రూ.2000కు పైగా రేటు ఉండే ఫుల్ బాటిళ్లను కొనడానికి పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదని సమాచారం. దీంతో ఎక్కువ మార్జిన్ ఉండే ఆ లిక్కర్ అమ్ముడవకపోవడంతో షాపుల యజమానులు తమ మార్కెటింగ్ ఆలోచనలకు పదును పెట్టారు. ఈఎంఐ పద్ధతిలో అమ్మకాలకు తెర తీశారు. ఆలోచన వచ్చిందే తడవుగా ప్రీమియం లిక్కర్ అమ్మకాల్లో ఈఎంఐ పద్ధతిలో చెల్లింపును అమలు చేసి రూ.5000 దాకా పరిమితితో మద్యాన్ని వాయిదాల పద్ధతి మీద మందుబాబులకు అమ్ముతున్నారు. మందుబాబులు ఈ వాయిదాల పద్ధతిలో ప్రీమియం లిక్కర్ కొనుగోలుకు ముందుకొస్తున్నారు. అయితే తమకు గానీ, తమ షాపుల్లో పనిచేసే వాళ్లకు తెలిసిన వాళ్లకు, ఆ ప్రాంతంలో చాలా రోజుల నుంచి నివాసం ఉంటున్న వాళ్లు లేదా సొంత ఇళ్లు కలిగిన వారికి మాత్రమే ఈ పద్ధతిలో షాపు యజమానులు లిక్కర్ అమ్ముతున్నట్లు చెబుతున్నారు.