అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్

by Kavitha |   ( Updated:2025-03-16 07:10:58.0  )
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. హైప్ పెంచేస్తున్న పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్‌గా స్టార్ డమ్ తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు, జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి(Deepika Pilli) జంటగా నటిస్తోన్న సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbai). ఇక ఈ చిత్రాన్ని నితిన్(Nithin), భరత్‌(Bharath)లు తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ మేరకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో రానుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి ఎవరినో నవ్వుతూ చూస్తున్నారు. అయితే వీరి వెనకాల గెటప్ శ్రీనుతో పాటు మరికొందరు కమెడియన్స్ కత్తులు పట్టుకుని వీళ్లను నరకడానికి అన్నట్లు దూసుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.



Next Story