నా భర్త ఎక్కడున్నాడో తెలియదు: అఖిలప్రియ

by srinivas |
నా భర్త ఎక్కడున్నాడో తెలియదు: అఖిలప్రియ
X

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను రెండోరోజు పోలీసులు విచారించారు. తాను రాజకీయ నాయకురాలినని, చాలామంది ఫోన్ కాల్స్ చేస్తుంటారని విచారణలో అఖిలప్రియ చెప్పారు. అదేవిధంగా భర్త భార్గవ్‌రామ్ ఆచూకీపై పోలీసులు ప్రశ్నించగా.. తన భర్త ఎక్కడున్నాడో తెలియదని అన్నారు. కిడ్నాపర్లతో అఖిలప్రియ మాట్లాడిన కాల్స్‌పై ముందుగా విచారణ జరిపిన పోలీసులు.. టవర్ లొకేషన్, కొత్త సిమ్ ఫోన్ నంబర్లను ముందు ఉంచగా.. తనకు ఏం తెలియదని, ప్రవీణ్‌రావు ఫ్యామిలీ మెంబర్స్‌కు తమకు ల్యాండ్ వివాదాలు ఉన్నట్లు తెలిపారు. నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్, ఇద్దరు ఏసీపీలు మంగళవారం అఖిలప్రియను ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed