బాలయ్య సినిమాకు ‘అఖండ’ ఆదరణ.. రికార్డుల ప్రభంజనమే

by Jakkula Samataha |   ( Updated:2023-12-16 15:09:45.0  )
బాలయ్య సినిమాకు ‘అఖండ’ ఆదరణ.. రికార్డుల ప్రభంజనమే
X

దిశ, సినిమా : నటసింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబో సినిమా ‘అఖండ’ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ వస్తోంది. ఉగాది కానుకగా ‘BB3 టైటిల్ రోర్’ పేరుతో విడుదలైన టీజర్.. యూట్యూబ్‌లో 31 మిలియన్ వ్యూస్‌‌తో దూసుకుపోతోంది. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపిన టీమ్.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఈ నెల 30 వరకు జరిగే ఫైనల్ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని తెలిపారు. ప్రగ్యా జైశ్వాల్, శ్రీకాంత్ కీలకపాత్రల్లో కనిపించబోతున్న సినిమాకు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement
Next Story