- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గాయంతోనే షూటింగ్‌కు హాజరైన బాలీవుడ్ హీరోయిన్

X
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఆకాంక్ష సింగ్ తెలుగులో ‘మళ్లీ రావా’ ‘దేవ్‌దాస్’ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ డైరెక్షన్‌లో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్న ‘మేడే’ సినిమాలో నటిస్తున్న ఆమె..చిత్రీకరణ సమయంలో గాయపడింది. హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో కాలుకి గాయం అయినా..అదే పెయిన్‌తో షూటింగ్ కంటిన్యూ చేసిందట. తన వల్ల నిర్మాతలు, కాస్ట్ అండ్ క్రూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఇలా చేసిందని సమాచారం. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసి బ్రేక్ తీసుకున్న ఆమెకు కాలు నొప్పి తగ్గకపోయినా..ముంబైలో మొదలైన షూటింగ్‌కు రెగ్యులర్‌గా అటెండ్ అవుతోందట. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో కనిపించబోతుండగా..బిగ్ బిని ఫస్ట్ టైం డైరెక్ట్ చేయబోతున్నారు అజయ్ దేవగన్.
Next Story