- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇక ఆర్టీసీ పెట్రోలు బంకులు
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా ప్రభావంతో పూర్తిగా బస్సులు నడవక మిగులు సిబ్బందితో ఉన్న తెలంగాణ ఆర్టీసీ ఇక నుంచి పెట్రోల్ బంకుల వ్యాపారం నిర్వహించి నెలకు రూ.80 లక్షల దాకా ఆదాయం సంపాదించనుందని రవాణాశాఖ మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కార్యాలయంలో పెట్రోల్ బంకుల వ్యాపారాన్ని అధికారికంగా ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడారు. ఇంధన అమ్మకాల వ్యాపారం ప్రత్యక్షంగా నిర్వహించడానికి హెచ్‌పీసీఎల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.
ఇంధన కంపెనీలు రిటైలింగ్‌కు చెల్లించే కమిషన్‌తో ఆర్టీసీకి ఆదాయం రానుందన్నారు. ఆర్టీసీ పెట్రోలు బంకులు నిర్వహించడం ద్వారా ప్రజలకు నాణ్యమైన, సరైన పరిమాణంలో పెట్రోలు, డీజిల్ లభించనుందన్నారు. దీంతో వాహనాల ఇంజన్ జీవిత కాలం పెరగడం, ఎక్కువ మైలేజ్ పొందడం లాంటి ప్రయోజనాలుంటాయని మంత్రి తెలిపారు. పెట్రోలు బంకుల లాంచింగ్ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు, ఈడీ పురుషోత్తం, ఈడీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.