అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన

by Shyam |   ( Updated:2020-04-14 01:46:25.0  )
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పాలన
X

దిశ‌, ఖమ్మం: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాల‌న సాగిస్తున్నార‌ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం వీడియోస్ కాలనీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం అంబేద్క‌ర్ జ‌యంతి కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. అనంత‌రం మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నార‌న్నారు.

విద్యతోనే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందన్న అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా రాష్ట్రంలో 671కి పైగా గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. దళితులు, గిరిజనులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతోనే ‘అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్’ పేరిట పేదలకు రూ.20 లక్షల ప్రోత్సాహక నగదు అందజేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అంబేద్కర్ ముందు చూపుతోనే రిజర్వేషన్లు అమలవుతున్నాయని, దీంతో దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయని అజయ్ కుమార్ అన్నారు.

Tags: ambedkar birth anversary, minister ajay kumar, ts news

Next Story