ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించొద్దు : ఏఐటీయూసీ

by Shyam |
ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించొద్దు : ఏఐటీయూసీ
X

దిశ, మహబూబ్ నగర్: ప్రజల ఆస్తులు అయిన ప్రభుత్వ రంగాలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడం తగదని ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ యూసుఫ్ విమర్శించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా విస్తృత నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని బి.కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎండీ యూసుఫ్ మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక లాభాల బాటలో పయనిస్తున్న రైల్వే, విమానయానం, బొగ్గు గనులు, పోస్టల్, ఎల్ఐసీ లాంటి రంగాలను ప్రైవేట్ పరం చేయడం దారుణమన్నారు. ఛాయ్ వాలా ప్రధాని అయ్యాక దేశాన్ని తాకట్టు పెడుతూ దేశ సంపదను కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement

Next Story