ఐష్ @25.. ‘భూమిక’ ఫస్ట్ లుక్

by Anukaran |   ( Updated:2020-10-19 04:07:13.0  )
ఐష్ @25.. ‘భూమిక’ ఫస్ట్ లుక్
X

దిశ, వెబ్‌డెస్క్: శైలజా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్.. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తమిళ్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసింది. యాంకర్‌గా కెరియర్ మొదలు పెట్టిన ఐష్.. హీరోయిన్‌గా రాణిస్తూ ఇప్పుడు 25వ సినిమాకు శ్రీకారం చుట్టింది. తన కెరియర్‌లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించిన ఆమె.. ‘భూమిక’గా రాబోతుంది.

రతీంద్రన్ ప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎకోలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండగా.. స్టోన్ బెంచ్ బ్యానర్‌పై కార్తీక్ సుబ్బరాజు సమర్పిస్తున్నారు. కార్తికేయన్ సంతానం, సుధన్ సుందరం, జయరామన్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాకు.. పృథ్వి చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్నారు.
తమిళ్, తెలుగులో బై లింగువల్‌ ప్రాజెక్టుగా వస్తున్న ‘భూమిక’ ఫస్ట్ లుక్‌లో పువ్వులు, ఆకులు, వేర్లతో కప్పబడిన ఐష్ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉండగా.. పాయిజన్ ఐవీ సినిమా నుంచి ఇన్‌స్పైర్ అయినట్లు ఉందంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story