400 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఐశ్వర్య సాంగ్..

by Shyam |
Aishwarya Rai
X

దిశ, సినిమా : అందాల సుందరీ ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్‌లో బిజీగా ఉంది. మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న ఈ ఎపిక్ పిక్చర్ షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఐశ్వర్యపై సాంగ్ చిత్రీకరణ చేస్తుండగా.. ఈ పాటకోసం దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు పని చేయనున్నారని సమాచారం. నేషనల్ అవార్డ్ విన్నర్ బృందా గోపాల్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సాంగ్ యూనిక్ అండ్ ది బెస్ట్‌గా నిలవబోతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. కాగా ఇప్పటికే ‘పద్మన్’, ‘దబాంగ్ 3’ లాంటి సినిమాల షూటింగ్‌ మహేశ్వర్‌లో జరుగుతుండగా. ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రీకరణ కూడా అక్కడే కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed