ఏయిర్ ఇండియా విమానాలపై నిషేధం

by Shamantha N |
ఏయిర్ ఇండియా విమానాలపై నిషేధం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎయిర్‌ ఇండియా విమానాలపై హాంకాంగ్ మరోసారి నిషేధం విధించింది.ఇవాళ్టి నుంచి ఈనెల 30వరకు ఈ నిషేధం కొనసాగనుంది. ఇండియా నుంచి తమ దేశానికి వచ్చిన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్ తెలిపింది.

కరోనా సమయంలో ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించడం మూడోసారి.మరోవైపు తాజాగా టాటా సియా సంస్థ నడుపుతున్న విస్తారా విమానాలను కూడా అనుమతించబోమని వెల్లడించింది.

Advertisement

Next Story