కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

by Shyam |
కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
X

దిశ, న్యూస్‌బ్యూరో: ఉద్యోగాల కల్పనపై కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. రెండేళ్ల నుంచి ఒక్క ఉద్యోగ నియామక ప్రకటన కూడా రాలేదని మంగళవారం మీడియాతో చెప్పారు. నిరుద్యోగుల ఓట్ల కోసమే 2018లో గ్రూప్- 4 నోటిఫికేషన్ విడుదల చేశారని, అప్పటి నుంచి ఒక్క నియామకం కూడా చేపట్టలేదని మండిపడ్డారు. 2018లో 4,35,383 మంది అర్హత కలిగిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించగా 2019 మార్చిలో ఫలితాలు విడుదల చేశారని, రెండేళ్లు గడిచినా నియామకాలు చేపట్టలేని అసమర్థ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. పెరిగిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల దృష్ట్యా గ్రూప్- 4 ఉద్యోగుల కొరత ఉందన్నారు. రాష్ట్ర సాధనలో విద్యార్థులు, నిరుద్యోగుల పాత్రనే అత్యంత కీలకమని, వారి త్యాగాల ఫలితమే ఇవాళ కేసీఆర్ కుటుంబం పదవులు అనుభవిస్తోందన్నారు.

Advertisement

Next Story