యూపీ పోలీసులపై మళ్లీ కాల్పులు

by Anukaran |   ( Updated:2020-07-14 23:37:10.0  )
యూపీ పోలీసులపై మళ్లీ కాల్పులు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లో రౌడీమూకాల్లో ఇంకా మార్పు రావడంలేదు. పోలీసులపై కాల్పులు, దాడులు చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా బదాయూంలో పోలీసులే లక్ష్యంగా రౌడీ మూకలు కాల్పులు జరిపారు. మంగళవారం రాత్రి కరావ్ బైపాస్ వద్ద సాధారణ తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులపై దాడి చేశారు. కాల్పుల్లో ఓ ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. ఎదురు కాల్పుల్లో ఓ క్రిమినల్‌కు గాయాలయ్యాయి. వెంటనే అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విషయాన్ని బదాయూం ఎస్ఎస్‌పీ అశోక్ కుమార్ త్రిపాఠి వివరించారు. కాగా, జూలై 3న కాన్పూర్ లో ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులు రౌడీల కాల్పుల్లో మృతిచెందిన సంఘటన తెలిసిందే. అదేవిధంగా వికాస్ దూబే, అతని అనుచరుల్లో ముగ్గురు కీలక వ్యక్తులు పోలీసుల కాల్పుల్లో హతమైన విషయం విధితమే.

Advertisement

Next Story