పరీక్షలు లేకుండా.. డిగ్రీ పట్టాలివ్వలేం : యూజీసీ

by Shamantha N |   ( Updated:2020-08-10 04:33:44.0  )
పరీక్షలు లేకుండా.. డిగ్రీ పట్టాలివ్వలేం : యూజీసీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ విలయం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని దెబ్బకు చాలా పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దుపై ఇవాళ సోమవారం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) త‌ర‌పున సోలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా మాట్లాడుతూ.. డిగ్రీలు ప్ర‌దానానికి సంబంధించి నియ‌మాలు రూపొందించే హ‌క్కు కేవ‌లం యూజీసీకి మాత్ర‌మే ఉంద‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వాలు యూజీసీ నియ‌మావ‌ళిని మార్చ‌లేవ‌ని స్పష్టంచేశారు. కరోనా నేప‌థ్యంలో విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌కుండా డిగ్రీలు ఇవ్వ‌లేమ‌ని తేల్చిచెప్పారు. అయితే, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఆగ‌స్టు 14కు వాయిదా వేసింది. కరోనా నేప‌థ్యంలో యూజీసీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని ఇటీవ‌ల మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ ప్ర‌భుత్వాలు నిర్ణ‌యించాయి. అయితే ఆ రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల స్పందించేందుకు యూజీసీకి సుప్రీం కొంత గ‌డువును ఇచ్చింది.

సెప్టెంబ‌ర్ 30వ తేదీలోగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని గ‌తంలో యూజీసీ ప్రకటించింది. యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఓవ‌ర్‌రైడ్ చేస్తుందా అని సుప్రీం ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. విద్యార్థులు చ‌దువుతూనే ఉండాల‌ని.. కానీ, వాళ్లు ప‌రీక్ష‌లు రాయ‌నంత వ‌ర‌కు వారికి డిగ్రీలు ఇవ్వ‌లేర‌ని మెహ‌తా వివరించారు.

Advertisement

Next Story

Most Viewed