- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తనను లైంగికంగా వేధించిన తండ్రి.. కిరోసిన్ పోసి నిప్పు అంటించిన కూతురు
దిశ, వెబ్ డెస్క్ : తండ్రి వేధింపులు భరించలేక.. ఓ మహిళ (22) దారుణానికి పాల్పడింది. తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించి తలబెట్టింది. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయింది.. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కన్న కూతురు అని కూడా చూడకుండా ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. తల్లి చనిపోయిన నాటి నుండి ప్రతిరోజూ శారీరకంగా, మానసికంగా హింసకు గురైంది. కనీసం పెళ్లి తర్వాత అయిన తన కష్టాలు తీరుతాయనుకుంది.
కానీ, వివాహ జీవితం కూడా సాఫీగా సాగలేదు. విడాకులు తీసుకుని మళ్లీ తండ్రి వద్దకే వచ్చి ఉండాల్సిన పరిస్థితి.. అదే అదునుగా మళ్లీ ఆ తండ్రి వేధింపులు మొదలుపెట్టాడు. జీవితంపై విరక్తి చెందిన ఆ మహిళ తన తండ్రిని దారుణంగా చంపేసింది.
వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ రెండ్రోజుల క్రితం తన తండ్రిని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించి, కడుపు నిండా తినిపించింది. ఆ తర్వాత హుగ్లీ నది ఒడ్డుకు తీసుకెళ్లింది. మద్యం మత్తులో అతడు నిద్రపోగానే.. ఆ మహిళ కిరోసిన్‌ను అతనిపై పోసి నిప్పంటించింది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ విషయం కాస్తా పోలీసులకు తెలియడంతో ఆమెను అరెస్ట్ చేసి విచారించగా.. బాధితురాలు తన తండ్రి అకృత్యాలను వెల్లడించింది. తండ్రి పెడుతున్న బాధలు తట్టుకోలేక అతడిని చంపేసినట్టు తెలిపింది.