- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏరోబిక్స్ ఎంతో మేలు..!
ప్రస్తుత మానవ జీవన విధానం యాంత్రికంగా మారింది. ఒకే సమయంలో పలు రకాల పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. ఈ క్రమంలో వ్యాయామం, యోగా, ధ్యానం, ఏరోబిక్స్ చేయడం వంటి వాటితో కొంత ఉపశమనం కలుగుతోంది.
ఏరోబిక్స్తో మెదడు చురుకుదనం, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, ఆలోచనా శక్తి, ఏకాగ్రత పెంచుకోవచ్చు. దీంతో ఆటలు, ఇండోర్ గేమ్స్‌లో చురుగ్గా పాల్గొనగలుగుతున్నారా లేదా వంటి అంశాలు మానసికంగా ఫిట్‌నెస్‌తో ఉన్నారా లేదో అన్నేదాన్ని తెలియజేస్తాయి. వీటిని బట్టి ఒక వ్యక్తి ఫిట్‌నెస్ సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చు. కానీ, శారీరకపరమైన ఇతర మార్పులేమీ జరగకుండా ఉఛ్వాస నిశ్వాసలు వేగంగా జరగడం, హృదయ స్పందన రేటు పెరగడం, కండరాల కదలికలు చురుకుగా ఉంచేందుకు దోహదపడే ఎక్సర్‌సైజెస్‌ను ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ అంటారు. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్టేషనరీ, సాధారణ సైక్లింగ్, స్విమ్మింగ్, ఆట్లాడటం, డ్యాన్స్ చేయటం వంటివన్నీ ఏరోబిక్ ఎక్సర్‌సైజెస్ కిందకు వస్తాయి. సమయం లేక వ్యాయామం చేయలేకపోతున్నామనే వారికి ఏరోబిక్ వ్యాయామాలు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.
ఏరోబిక్స్తో గుండె పనితీరులో మెరుగుదల ఉంటుంది. అమ్మాయిల్లో చాలా సాధారణంగా వచ్చే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని ఏరోబిక్స్ చాలా వరకు దూరం చేస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో మధుమేహం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడంతో పాటు శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ పెంచి, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. శరీర కండరాల బలానికి తోడ్పడుతోంది. ఏరోబిక్ వ్యాయామాలు అధిక రక్తపోటును తగ్గించడమే కాకుండా ఒత్తిడిని అధిగమించగల సామర్థ్యం, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతాయి. ఏరోబిక్ వ్యాయామాల వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతున్నట్టు పరిశోధనల్లో తేలింది. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది.
ఏరోబిక్స్ చేసేవారిలో హృద్రోగ వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) స్పష్టం చేసింది. ఏరోబిక్స్ మొదలు పెట్టే ముందు అప్పటి వరకు చేస్తున్న వ్యాయామాన్ని, ఆరోగ్యస్థితిని, బరువును దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.