వాటాలను విక్రయించిన హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ

by Harish |
వాటాలను విక్రయించిన హెచ్‌డీఎఫ్‌సీ ఎండీ
X

దిశ, వెబ్‌డెస్క్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్య పూరి..కంపెనీలో తనకున్న రూ. 843 కోట్ల విలువైన 95 శాతం వాటాను విక్రయించారు. జులై 21 నుంచి 24వ తేదీల మధ్య ఆదిత్య పూరి 74.2 లక్షల షేర్లను అమ్మినట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడైంది. మార్చి 31 నాటికి ఆదియ పూరి తన పేరున మొత్తం 0.14 శాతంతో 77.96 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. తాజా విక్రయం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఆయన 0.01 శాతం అంటే 3.76 లక్షల షేర్లను కలిగి ఉన్నారు.

ఈ అంశంపై స్పందించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రతినిధి ఒకరు..ఆదిత్య పూరికి వేరు వేరు సమయాల్లో, వేర్వేరు ధరలతో ఈ వాటాలను కేటాయించినందున ఆయన వాటాల విక్రయం ద్వారా రూ. 843 కోట్లను పొందకపోవచ్చని..వాటాల సమూపార్జనకు అయ్యే ఖర్చు, పన్ను చెల్లింపుల తర్వాత ఆ మొత్తాన్ని లెక్కించబడుతుందన్నారు.

అత్యధిక పారితోషికం తీసుకునే బ్యాంకర్లలో ఒకరైన ఆదిత్య పూరి అక్టోబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. గత 25 ఏళ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా తీర్చిదిద్దడంలో ఆదిత్య పూరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆదిత్య వేతనం 38 శాతం పెరిగి రూ. 18.92 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం ఏడాదిలో స్టాక్ ఆప్షన్లను ఉపయోగించడం ద్వారా ఆదిత్య పూరి రూ. 161.56 కోట్లను సంపాదించారు.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు

Advertisement

Next Story

Most Viewed