- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలవరపెడుతున్న కత్తెర పురుగు.. అవస్థలు పడుతున్న అన్నదాత
దిశ, లోకేశ్వరం: ప్రభుత్వం సలహా మేరకు వరికి బదులుగా మొక్కజొన్న సాగుకు మొగ్గుచూపుతున్న కర్షకులను కత్తెర పురుగు కలవరపెడుతోంది. మొక్కలు నాలుగు ఆకుల దశకు చేరగానే కత్తెర పురుగు ఉధృతి రోజురోజుకు తీవ్రం అవుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడానికి అన్నదాతలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. పురుగు ఉధృతిని బట్టి వారానికి ఒకసారి నానా రకాల పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. మొక్క మీటర్లకు పైగా ఎత్తు పెరిగితే కత్తెర పురుగు ఉధృతి తగ్గుతోందని అంతవరకు పంటను కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత వరకు కనీసం నాలుగైదు సార్లు పలురకాల పురుగుమందులను మార్చుతూ పిచికారీ చేస్తున్నట్లు తెలిపారు.
పెరుగుతున్న పెట్టుబడి వ్యయం..
గతంలో మొక్కజొన్న పంట సాగుకు పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండేది. పురుగు మందుల పిచికారీ అవసరమయ్యేది కాదు. కంకి దశకు రాగానే మొగిలో ఫోరేట్ గుళికలు మాత్రమే వేసేవారు. కానీ ప్రస్తుతం కత్తెర పురుగు ఉధృతి వల్ల నాలుగైదుసార్లు స్ప్రే చేయాల్సి రావడంతో ఎకరానికి కనీసం రూ. 4 వేల పెట్టుబడి వ్యయం పెరుగుతోందని, అలాగే దిగుబడులపై కూడా ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాల్ కు రూ. 1600 పైగా మద్దతు ధర లభిస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.