NIA Kuldeep Singh‌: సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్‌కు ఎన్‌ఐఏ చీఫ్‌గా అదనపు బాధ్యతలు

by Shamantha N |   ( Updated:2021-05-29 06:44:39.0  )
NIA Kuldeep Singh‌: సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్‌కు ఎన్‌ఐఏ చీఫ్‌గా అదనపు బాధ్యతలు
X

న్యూఢిల్లీ: సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్‌కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చీఫ్‌గా కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ వైసీ మోడీ(1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి) ఈ నెల 31న రిటైర్ కాబోతున్నారు. అసోం, మేఘాలయా క్యాడర్ అధికారి వైసీ మోడీని ఎన్ఐఏ చీఫ్‌గా 2017 సెప్టెంబర్‌లో కేంద్రం నియమించింది. తాజాగా, ఆయన పదవీ విరమణ చెందుతుండటంతో ఆ బాధ్యతలను సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్‌కు అప్పగించింది. 1986 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ క్యాడర్ అధికారి కుల్దీప్ సింగ్ ఈ బాధ్యతలను నూతన ఎన్‌ఐఏ డీజీని నియమించే వరకు చేపట్టాల్సి ఉంటుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో శనివారం వెల్లడించింది. సీఆర్‌పీఎఫ్ డీజీగా కుల్దీప్ సింగ్ తన రిటైర్‌మెంట్ (సెప్టెంబర్ 30, 22) వరకు కొనసాగనున్నారు.

Advertisement

Next Story