‘అడవి రాముడి’‌కి 43 ఏళ్లు..

by Shyam |
‘అడవి రాముడి’‌కి 43 ఏళ్లు..
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆనాడు ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచిన ‘అడవిరాముడు’ మూవీ రిలీజై నేటికి 43 ఏళ్లు అవుతున్నది. 1977 ఏప్రిల్ 28న విడుదలైన ఈ చిత్రం ఆనాడు ఘన విజయం సాధించడమే కాదు ఆనాటికి ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసింది. 32 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. ఈ సినిమాతో పలు కొత్త కాంబినేషన్లు షురూ అయ్యాయి. ఎన్టీఆర్‌తో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి ఇది తొలి సినిమా.. ఈ చిత్రం తర్వాత ఆయన ఇంకో 11 సినిమాలు చేశారు. హీరోయిన్ జయప్రదకు ఎన్టీఆర్‌తో తొలి సినిమా ఇది.

ట్రెండ్ సెట్టర్‌గా…

ఈ సినిమాలోని పాటలు, సన్నివేశాలు, హీరో హీరోయిన్ల సంభాషణలు, ఫైట్లు ఆ తర్వాత కాలానికి ట్రెండ్ సెట్‌గా నిలిచాయని అభిమానులు చెబుతారు. కథ, కథనం, మ్యూజిక్, హీరో, హీరోయిన్ల డ్యాన్స్‌ల గురించి చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రజానీకంలో ఇప్పటికీ చిరంజీవులుగా ఉన్నాయి. ‘ఆరేసుకోబోయి..పారేసుకున్నాను’, ‘క‌ృషి ఉంటే మనుషులు రుషులవుతారు’ వంటి పాటలు జనాల నోళ్లలో నానుతూ.. ఇప్పటికీ ఇండ్లల్లో మార్మోగుతుంటాయి.

కమర్షియల్ యాంగిల్..

అప్పటి వరకు కొంత పౌరాణిక పాత్రలు చేసిన ఎన్టీఆర్‌తో సాంఘీక చిత్రం అయిన అడవిరాముడుతో దర్శకుడు రాఘవేంద్రరావు తనలోని కమర్షియల్ యాంగిల్‌ను తెరపైన అద్భుతంగా ఆవిష్కరించారు. ఎన్టీఆర్ లుక్స్, టాక్స్, డ్యాన్స్ లకు కమర్షియల్‌గా మరల్చాడు. సొబగులద్ది కొత్త పుంతలుతొక్కించారు. చిత్రంలో కొత్త రామారావును చూపించారని అభిమానులు రాఘవేంద్రరావును పొగిడారు. విజయయాత్రలు చేసింది చిత్రబృందం. చిత్రానికి అన్ని పాటలు వేటూరి సుందరరామమూర్తి రచించగా, సంగీతం కె.వి.మహదేవన్ అందించారు. కథ విషయానికొస్తే.. అటవీ ప్రాంతంలోని సామగ్రి, వృక్ష సంపదను నాగభూషణం, సత్యనారాయణ దోపిడీ చేస్తుంటారు. రాము (ఎన్టీఆర్) ప్రజల పక్షాన వారిని ఎదుర్కొంటాడు. అటవీశాఖాధికారి కుమార్తె జయప్రద అతన్ని ప్రేమిస్తుంది. అయితే, మరో హీరోయిన్‌గా ఉన్న జయసుధ రామును అన్నయ్యగా భావించి ఆయన్ను సపోర్ట్ చేస్తుంది. ఇక ఫారెస్టు ఆఫీసర్‌గా వచ్చిన రాము ప్రజల్లో మమైకమై మామూలు వ్యక్తిగా అక్కడి విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత దోపిడీ దారుల ఆటకట్టించి, తాను అధికారినని చెబుతాడు. అలా కథ సుఖాంతమవుతుంది. అడవి రాముడు చిత్రం కొంత కన్నడ నటుడు రాజ్ కుమార్ నటించిన ‘గందద గుడి’ చిత్రానికి ఆధారం. అయినా రామారావుకు సరిపడేట్టు కొంత మార్పులు చేర్పులు చేసి డైరెక్టర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామారావుకు విజయవాడ యాక్స్ టైలర్స్ వారు దుస్తులు డిజైన్ చేశారు. చిత్రంలో కొన్ని సన్నివేశాలు బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ అమితాబ్ నటించిన షోలే లోని సన్నివేశాల వలే ఉంటాయి. ఈ చిత్రం అప్పట్లో ఉన్న రికార్డులన్నింటినీ తిరగ రాసింది. 4 కేంద్రాల్లో 365 రోజులు ఆడింది.

Tags: adavi ramudu movie, k raghavendra rao, ntr, combination, jaya prada, jaya sudha

Advertisement

Next Story

Most Viewed