ఆగిపోయిన గంగూలీ ప్రకటన..

by Shyam |
ఆగిపోయిన గంగూలీ ప్రకటన..
X

దిశ, వెబ్ డెస్క్: సెలెబ్రిటీలు చాలామంది బ్రాండ్ ప్రమోషన్స్‌తో కోట్లు సంపాదిస్తున్న విషయం తెలిసిందే. మరి వాళ్లు కూడా అవే ప్రొడక్ట్స్ వాడతారా? అన్న విషయం పక్కనబెడితే.. కమర్షియల్ లెక్కలకు తావిస్తూ, తమను ఆరాధించే కోట్లాదిమంది అభిమానులు ఆయా ప్రొడక్ట్స్‌ను వాడేలా యాడ్స్‌లో నటిస్తారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు కూడా సౌరవ్ గంగూలీ కూడా ఓ యాడ్‌లో నటిస్తుండగా.. ఇప్పుడు ఆ ప్రకటన ఆగిపోవడం గమనార్హం. ఇంతకీ ఆగిపోవడానికి కారణం ఏంటి?

దాదాకు గుండెపోటు, అదానీ గ్రూప్‌కు చెందిన విల్మార్ కంపెనీని చిక్కులో పడేసింది. ఆ కంపెనీ తయారుచేస్తున్న ఫార్చూన్ రైస్ బ్రాన్ ఆయిల్‌కు గంగూలీ కొన్నాళ్ల నుంచి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘ఇది హార్ట్ హెల్తీ ఆయిల్, ఇది వాడితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది’ అని గంగూలీ ఆ ప్రకటనలో పేర్కొంటాడు. కానీ ఇప్పుడు దాదాకు గుండెపోటు రావడంతో మీమర్స్ ఆ కంపెనీ ఉత్పత్తులపై సెటైర్లు వేస్తున్నారు. ‘బ్రాండ్ అంబాసిడర్‌కే గుండెపోటు వచ్చిందని, ఫార్చూన్ ఆయిల్ వాడొద్దని’ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదానీ ఆయిల్ వాడితే గుండెపోటు ఖాయం అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దాంతో సదరు కంపెనీ.. గంగూలీ యాడ్‌ను వెంటనే నిలిపేసింది.

ఇక గుండెపోటుతో స్థానిక ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయిన గంగూలీకి స్టెంట్ వేయడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో బుధవారం డిశ్చార్జి చేసే అవకాశం ఉందని, కొద్ది రోజుల తర్వాత ఆయనకు యాంజియోప్లాస్టీ చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed