- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మళ్లీ బెయిల్ కు దరఖాస్తు చేసిన రియా…

X
దిశ వెబ్ డెస్క్:
బెయిల్ కోసం నటి రియా చక్రవర్తి దరఖాస్తు చేసుకున్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో డ్రగ్స్ కోణంపై నార్కోటిక్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ అంశంలో నటి రియా చక్రవర్తిని మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 14 రోజులు జ్యుడిసియల్ కస్టడీని ఆమెకు కోర్టు విధించింది. దీంతో ముంబయిలోని బైకుల్లా జైలుకు ఆమెను తరలించారు. అయితే మంగళవారం రాత్రే బెయిల్ పిటిషన్ ను రియా దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను మెజిస్ట్రేట్ కొట్టి వేసింది. దీంతో ఇవాళ ఎన్డీపీఎస్ న్యాయస్థానంలో తన న్యాయవాది ద్వారా రియా పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై గురువారం విచారణ జరగనుంది. ఇదే కేసులో అరెస్టైన రియా సోదరుడు షోవిక్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Next Story