డ్రగ్స్ కేసులో 20మంది సెలబ్రిటీలు

by Sumithra |   ( Updated:2020-09-07 07:08:38.0  )
డ్రగ్స్ కేసులో 20మంది సెలబ్రిటీలు
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్‌ కేసులో అరెస్టైన నటి రాగిణి.. సీసీబీ పోలీసుల విచారణలో కీలక విషయాలను బయట పెట్టినట్లు తెలుస్తోంది. బెంగళూరులో డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తుల పేర్లను రాబట్టిన పోలీసులు.. ఇదే కేసులో అరెస్టైన రవిశంకర్, సంజనా, రాహుల్‌ నుంచి కూడా అనేక విషయాలను సేకరించారు. రాజకీయ, సినీ పరిశ్రమ వారసులతో పాటు ఐపీఎస్‌ అధికారుల పుత్రరత్నాలకు సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఈ కేసులో 20మంది సెలబ్రిటీల జబితాను రెడీ చేసినట్లు తెలుస్తుండగా వారికి త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. రాగిణితో పాటు 12మందిపై కాటన్‌పేట పోలీసులు కేసు నమోదు చేయగా ఇందులో ఏ1-శివప్రకాశ్, ఏ2గా రాగిణి, ఏ3గా ఢిల్లీకి చెందిన వీరేన్‌ ఖన్నాను చేర్చారు.

Advertisement

Next Story