మీ పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారా?: జెనీలియా

by Shyam |
మీ పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారా?: జెనీలియా
X

బొమ్మరిల్లు, ఆరెంజ్ లాంటి సినిమాలతో తెలుగులో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోయిన్ జెనీలియా. బాలీవుడ్ యాక్టర్ రితీశ్ దేశ్‌‌ముఖ్‌తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. తన ఇద్దరు పిల్లలు(రియాన్, రహైల్)తో తీరిక లేకుండా గడుపుతున్న జెనీలియా పిల్లల గురించి కొన్ని సూచనలు చేసింది. రియాన్, రహైల్ పెరుగుతున్న విధానం చాలా ఆసక్తిగా ఉందని, వారి ప్రశ్నలు, పరిశీలనలు అందుకు తగిన ప్రతిస్పందనలు నన్ను ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని అంటోంది. ‘ప్రపంచంలో వారు ఎక్కువగా ఇష్టపడేది చెస్. ఇలాంటివి ఎంచుకోవడం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ పెంపొందుతుంది, చెస్ గురించి ప్రతిదీ నేర్చుకోవాలనే కుతూహలంతో ఉన్న వారిని చూస్తే ముచ్చటేస్తుంది’ అని చెబుతోంది జెనీలియా. ఇక తన పిల్లలు చెస్ ఆడే క్రమంలో కొన్నిసార్లు ఈ ప్రపంచాన్నే మరిచిపోతారట. అలాంటి పిల్లలకు తల్లిదండ్రులుగా మనమిచ్చే ప్రోత్సాహం.. రేపు వారికి అవకాశాల ప్రపంచాన్ని పరిచయం చేస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దని సూచిస్తోంది.

అమ్మానాన్నలుగా మీ పిల్లలు రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నారని, అన్వేషిస్తున్నారని మీరు ఎలా నిర్ధారిస్తున్నారో మాకు చెప్పమని అడుగుతోంది. నెస్లేనన్‌గ్రోఇండియా(@nestlenangrowindia)తో ఎదుగుతున్న మీ పిల్లల్లోని ప్రత్యేకతను షేర్ చేసుకుంటే.. వారు తెరకెక్కించే డిజిటల్ ఫిల్మ్‌లో నటించే అవకాశం పొందుతారని తెలిపింది. దీంతోపాటు మీ చిన్నారుల భవిష్యత్‌కు సహాయపడే మరెన్నో బహుమతులు పొందుతారని చెప్పుకొచ్చింది జెనీలియా.

Advertisement

Next Story