నాకు ఫ్రీగా రీచార్జ్ చేస్తారా?.. సోనూసూద్ రిక్వెస్ట్!

by Shamantha N |
నాకు ఫ్రీగా రీచార్జ్ చేస్తారా?.. సోనూసూద్ రిక్వెస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : లాక్‌డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్న ఎందరినో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆదుకున్నారు. ప్రజలకు ఆయన అందించిన సేవలు అనన్య సామాన్యమైనవి. చదువుకునే నిరుపేద విద్యార్థులకు కూడా సోనూ తన వంతు సాయం అందించాడు. ఇంత చేసిన ‘సోనూ’ తన ఫోన్‌కు ఫ్రీ రీచార్జ్‌ చేయాలని సోషల్ మీడియాలో కోరాడు. ఎందుకంటే.. ఓ మొబైల్‌ షాప్‌ యజమాని తన మొబైల్ స్టోర్‌కు సోనూసూద్ పేరు పెట్టుకున్నాడు. పక్కనే సోనూ ఫోటో కూడా పెట్టాడు. అది తెలుసుకున్న సోనూ ‘మీరు నా మొబైల్‌కు ఫ్రీగా రీచార్జ్‌ చేస్తారా?’ అని తమాషాగా అడిగిన ఆ పిక్‌ను తన ట్విటర్‌లో పంచుకున్నాడు. అది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు తగిన వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా, పేదలకు కూడా అండగా నిలిచారు. ముఖ్యంగా వలస కూలీలకు సోనూ దేవుడయ్యాడు. వారిని స్వస్థలాలకు చేరేలా తగు జాగ్రత్తలు తీసుకుని రియల్‌ హీరో అనిపించుకున్నాడు. దీంతో సోనూసూద్‌పై ప్రజలు మమకారాన్ని పెంచుకున్నారు.కొందరైతే ఏకంగా తమ పిల్లలకు సోనూసూద్‌ పేరు పెట్టుకుంటున్నారు. మరికొందరు సోనూ విగ్రహాలను సైతం ఆవిష్కరించారు.

https://twitter.com/SonuSood/status/1319858830084198400?s=20

Advertisement

Next Story