తప్పుడు మెడికల్ స‌ర్టిఫికెట్లు సమర్పిస్తే కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్

by Shyam |
Collector
X

దిశ, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా లోకల్ క్యాడర్ పోస్టుల ఉద్యోగుల కేటాయింపు‌లో ప్రాధాన్యత కేటాయింపుల కోసం ఉద్యోగులు ఎవరైనా తప్పుడు మెడికల్ స‌ర్టిఫికెట్లు సమర్పించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. లోకల్ క్యాడర్ ఉద్యోగుల అలాట్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు 317కు అనుగుణంగా ఉద్యోగుల అలాట్మెంట్ జరుగుతుందన్నారు. ప్రాధాన్యత కేటాయింపుల కోసం ఉద్యోగులు సమర్పించే మెడికల్ స‌ర్టిఫికెట్లు వైద్య బృందం‌చే క్షుణ్ణంగా పరిశీలించి పరిగణలోకి తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed