ఆ ఆరు మండలాల్లో గంజాయి వాడకం పెరిగింది :ఏసీపి ఫణీంధర్

by Shyam |
ఆ ఆరు మండలాల్లో గంజాయి వాడకం పెరిగింది :ఏసీపి ఫణీంధర్
X

దిశ, ఖానాపూర్: మండల పరిషత్ లో జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఏసీపి ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖానాపూర్ ప్రాంతంలో గంజాయికి కొంతమంది బానిసలైనారని, గంజాయి ఉన్నా, పండించినా, లేదా అమ్మినా నేరమే అని అన్నారు. ఇటీవల నర్సంపేట పరిధిలోని ఆరు మండలాల్లో గంజాయి వాడకం పెరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలను మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసుకోవాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ , ఒరిస్సా సరిహద్దుల నుండి గంజాయిని ఇల్లందు , ములుగు , మహబూబాబాద్ ప్రాంతం ద్వారా రవాణా అవుతుందన్నారు. నర్సంపేట ప్రాంతంలో ప్రధానంగా డంప్ అవుతున్నట్లు ఆధారాలు లభించాయన్నారు. సీఎం కేసీఆర్ గంజాయి పట్ల ఉక్కుపాదం మోపమని ఆదేశించిని విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

Next Story

Most Viewed