- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రైవింగ్ రాకున్నా లైసెన్సులు.. ప్రమాదాలకు ఇదే కారణం..?
దిశ, తెలంగాణ బ్యూరో : నిత్యం ఏదో ఓ చోట జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల వాహనంతో రోడ్డెక్కాలంటేనే భయపడాల్సి వస్తోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నపట్టికీ నిత్యం జరిగే ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాలకు కారణాలు ఏంటని పోలీసు శాఖ విచారణ చేయగా ఎక్కువ శాతం మద్యం తాగి వాహనం నడపడం, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, సరైన డ్రైవింగ్ మెలుకువలు తెలియకుండా రోడ్డెక్కడంతో వీరితో పాటు ఇతర వాహనదారులకూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసింది. దీంతో ప్రమాదాలకు కారణమైన వ్యక్తులను విచారణ చేయగా చాలా మంది వాహనదారులు మైనర్ లుగా, డ్రైవింగ్ రాకున్నా లైసెన్సులు మాత్రం పొందిన వారు అధికంగా ఉన్నట్లు తెలుసుకున్నారు.
వాహనదారులకు ద్విచక్రవాహనం మాత్రమే నడపడం తెలిసినా వారు ఫోర్ వీలర్ లైసెన్సులు పొందిన వారితో పాటు మైనర్ డ్రైవింగ్ ని ప్రోత్సహించిన వారిని గుర్తించారు. దీంతో హైదరాబాద్ లో ఇలాంటి వారిని గుర్తించేందుకు పోలీసుశాఖ నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2019 డిసెంబర్ నుంచి 2021 మార్చి వరకూ 12,033 మందిపై కేసులు నమోదుచేసి వారి లైసెన్సులను రెండేళ్ల పాటు నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మైనర్ డ్రైవింగ్ ప్రోత్సహించిన 5724 మంది లైసెన్సులు రెండేళ్లు నిలిపివేశారు.ఇలాంటి రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ఇతర నిబంధనలు సరిగ్గా అమలు జరిగేలా చూసేలా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే కేవలం చలాన్ కట్టి ఫొటో దిగితే చాలంటున్న దళారుల మాటలు నమ్మి అధికంగా డబ్బులు చెల్లించి మరీ వాహనదారులు తమకు అర్హత లేని లైసెన్సులను పొందుతున్నారు. తప్పని తెలిసినా వాహనదారులు ఇలాంటి చర్యలను ప్రోత్సహిచడంతో డ్రైవింగ్ సరిగ్గా రాకుండానే లైసెన్సు పొంది రోడ్డెక్కేస్తున్నారు. వీరితో పాటు రోడ్డుపై ప్రమాదకరంగా వాహనం నడుపుతూ ఇతర వాహనదారులకు ప్రమాదాలను కలిగిస్తున్నారు. ఇలాంటి వారిని పోలీసులు ఎప్పటికప్పుడు గుర్తించి వారికి జరిమానాలు విధించినా మారని వారిపై కేసులు విధించి వారి లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నారు.
కేంద్రం డ్రైవింగ్ లైసెన్సుల జారీని మరింత సులభతరం చేసే విధంగా కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధనల ద్వారా డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులకు స్వేచ్ఛని కలిపించనుంది. డ్రైవింగ్ స్కూల్ లో శిక్షణ పొందిన వ్యక్తులకు ఎలాంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్సు పొందేలా కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ఇప్పటికే కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న ఫేక్ డ్రైవింగ్ లైసెన్సులు మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కొందరు డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు కేవలం డ్రైవింగ్ శిక్షణ మాత్రమే ఇచ్చి వాహనం రోడ్డెక్కగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలను తెలపడం లేదని, చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవుతేనే లైసెన్సు ఇస్తున్నాం
-పురుషోత్తం, డిప్యూటీ ట్రాన్సుపోర్టు కమిషనర్, వరంగల్
లైసెన్సు కోసం వచ్చే వారు తప్పనిసరిగా డ్రైవింగ్ టెస్ట్ లో పాస్ అవుతేనే లైసెన్సు ఇస్తున్నాం. ప్రజలు కూడా దళారులను నమ్మి డ్రైవింగ్ రాకున్నా లైసెన్సులు తీసుకోవచ్చనే మాటలను నమ్మకండి. రోడ్డు భద్రతా వారోత్సవాలతో ప్రతిఒక్కరికీ డ్రైవింగ్ పై అవగాహనలు కల్పిస్తున్నాం. మైనర్ డ్రైవింగ్ ను ప్రోత్సహించడం చట్టవిరుద్ధమని తెలిసినా వారి తల్లిదండ్రులు వాహనం ఇచ్చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వలేదు.