రూ.150 కోట్ల మేర అక్రమాలు : ఏసీబీ

by srinivas |
రూ.150 కోట్ల మేర అక్రమాలు : ఏసీబీ
X

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై ఏసీబీ స్పందించింది. నియమ నిబంధనలను ఉల్లంఘించి ఈఎస్‌ఐలో మందులు కొనుగోళ్లు చేశారని, నామినేషన్‌లో టెండర్లు కేటాయించి, మార్కెట్ రేటుకంటే ఎక్కువ రేటుకు కొనుగోళ్లు చేశారని, జీకే రమేశ్‌కుమార్, విజయ్‌కుమార్‌తో పాటు అచ్చెన్నాయుడుపై ఆధారాలు ఉన్నాయని ఏసీబీ స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామని అన్నారు. అచ్చెన్నాయుడిని శుక్రవారం సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు. మొత్తం ఈ అవినీతిలో 19మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. మందులు, ల్యాబ్‌కిట్స్, పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని నిర్ధారించారు. మొత్తం రూ.988 కొనుగోళ్లలో రూ.150 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయని ఏసీబీ విశాఖ రేంజ్ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed