ESI స్కాంలో మరో 8మందిపై కేసు..

by Anukaran |
ESI స్కాంలో మరో 8మందిపై కేసు..
X

దిశ, న్యూస్ బ్యూరో :

మెడికల్ కుంభకోణంలో IMS మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో 8 మంది నిందితులపై మరో అవినీతి నిరోధక కేసు నమోదైంది. అవినీతి, అక్రమంగా, నకిలీ రికార్డులతో ప్రభుత్వ ఖాజానాకు భారీగా నష్టం కలిగించిన మొత్తం 9 మందిపై ACB అధికారులు కేసును నమోదు చేశారు. కేవలం రూ. 3,300లకే లభించే హిమోక్యూ క్యూవెట్లను రూ. 16,500లకు కోట్ చేసిన వారికి బిల్లులు చెల్లించడంపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

మాజీ డైరెక్టర్ దేవికారాణీతో పాటు జాయింట్ డైరెక్టర్ కలకుంట్ల పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ కూరపాటి వసంత ఇందిర, ఓమిని మెడి కంచర్ల శ్రీహరి బాబు అలియాస్ కె.బాబ్జీ, ఓమిని హెల్త్‌కేర్ ప్రతినిధి కంచర్ల సుజాత, లీజెండ్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధి కుక్కల కృపాసాగర్ రెడ్డి, హోమోక్యూ రీజినల్ మేనేజర్ టంకశాల వెంకటేష్, ఓమిని మెడికల్ ఉద్యోగి బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజులపై అవినీతి నిరోధక చట్టం ప్రకారంగా కేసునమోదు చేసినట్టు ఏసీబీ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్ళితే.. ఓమిని మెడి యజమాని శ్రీహరి బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు నష్టపోయిందని తెలిపారు. ఈ కుంభకోణంలో ఇతడు కీలక పాత్ర పోషించినట్లు తమ విచారణలో వెల్లడైందని ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed