ఈ ఆఫ్రికన్ బ్రహ్మానందం గురించి మీకు తెలియని రహస్యాలు

by Anukaran |
ఈ ఆఫ్రికన్ బ్రహ్మానందం గురించి మీకు తెలియని రహస్యాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎవరు ఏ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలన్నా..ఏ మీమ్ తయారు చేయాలన్నా ఇతగాడిని ఆశ్రయించక తప్పదు. ఏ సందర్భానికి ఏ ఎక్స్‌ప్రెషన్ కావాలంటే అది ఒసితా దగ్గర దొరుకుతుంది. జనాలు రాతలతో,మాటలతో బదులివ్వడం మానేసి.. ఒసితా ఎక్స్‌ప్రెషన్ తీసుకుని దాంతోనే బదులిస్తారు. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సాప్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసినా ఒసితా హావభావాల ఫొటోలు, జీఐఎఫ్‌లు, మీమ్స్ కోకొల్లలు. ఇది కేవలం నైజీరయన్లు మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలకు చెందిన మీమ్ క్రియేటర్ ఒసితా హావభావాలను సోషల్ మీడియాలో విస్తృతంగా వాడుతుండటం విశేషం. చూడటానికే పిల్లడాలి ఉన్నా. ఈయన మహా గట్టోడు.

నైజీరియన్ యాక్టర్ గా సుపరిచితుడే అయినా… ఈ కమెడియన్ గురించి తెలుసుకుంటే వార్వెవా అనాల్సిందే. వందల కోట్ల ఆస్తి. కమెడియన్ గా, మెజిషియన్ గా, ప్రొడ్యూసర్ గా ఇలా అన్నీ విభాగాల్లో రాణించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆ దేశ యువతకు అండగా నిలుస్తున్నారు. మరి అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ నైజీరియన్ యాక్టర్ గురించి తెలుసుకుందాం.

మీమ్..! మన జీవితంలో రోజూ జరిగే వాటిని ఎంటర్ టైన్ గా చూపించి మన స్ట్రెస్ ను తగ్గించేదే. సింపుల్ గా చెప్పాలంటే మీలో ఉండి మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేది. మనలో చాలామంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు. వాళ్లలో చాలా క్రియేటివిటీ ఉంటుంది. అది అందరి ముందు చూపించలేక మీమ్స్ క్రియేట్ చేస్తుంటారు. అలాంటి మీమ్స్ లో చిన్నపిల్లాడి క్యారెక్టర్ లో కనిపిస్తూ నవ్వులు పూయిస్తుంటారు ఒసితా ఇహెమ్.

1982లో నైజీరియా దేశం ఇమో రాష్ట్రంలో ఒసితా ఇహెమ్ జన్మించారు. చూడటానికి చిన్నపిల్లాడిలా కనిపించే ఒసితా వయస్సు అక్షరాల 38సంవత్సరాలు. జన్యులోపం కారణంగా వయస్సు పెరిగినా మరగుజ్జులాగా కనిపిస్తారు. ఉన్న మరగుజ్జు ఆకారాన్ని చూసి కుమిలిపోకుండా తనకెంతో ఇష్టమైన సినీ రంగంలో రాణిస్తున్నారు. 2002లో నాలివుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఒసితా 2003లో అకీనా ఉక్వా అనే నైజీరియన్ సినిమాలో పావ్ పావ్ అనే బాలుడి పాత్రలో పరకాయప్రవేశం చేశారు. ఆ క్యారక్టర్ నైజీరియన్లే కాదు ప్రపంచ దేశాలు గుర్తించేలా చేశాయి. అదే ఏడాది దాదాపూ 16 సినిమాల్లో యాక్ట్ చేసి రికార్డ్ సృష్టించారు. అలా ఇప్పటి వరకు 60 సినిమాలకు పైగా యాక్ట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ మరగుజ్జు.., తనకున్న రూ.300కోట్ల ఆస్తుల్ని దేశంలోని యువతకోసం ఖర్చుపెడుతున్నారు.

నైజీరియన్ దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అక్కడి యువత కోసం ఇన్ స్పైర్డ్ మూవ్ మెంట్ ఆఫ్రికా అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా ఆఫ్రికా- నైజీరియన్ యువతలో స్పూర్తి నింపేందుకు కృషి చేస్తున్నారు. ఆయన కృషికి గాను 2011లో నైజీరియా ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది ఫెడరల్ రిపబ్లిక్ తో సత్కరించింది.

Advertisement

Next Story