ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య

by Sumithra |   ( Updated:2020-04-06 21:44:58.0  )

దిశ, మహబూబ్‌నగర్: జడ్చర్ల మండలం చిన్న ఆదిరాలలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ షంషొద్దీన్‌ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సంపంగి ఆంజనేయులు(25 తండ్రి ద్విచక్రవాహనం తీసుకొని ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సోమవారం రాత్రివరకు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చూట్టు వెతికారు. వ్యవసాయం పొలం వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags: young man, suicide, farm, mahabubnagar, Jadcherla

Next Story

Most Viewed