బెడ్‌పై ఆ పని చేస్తుండగా.. కేకలు వేసిన భార్య.. భర్త ఏం చేసాడో తెలుసా.?

by vinod kumar |   ( Updated:2021-07-17 06:18:19.0  )
snakes
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా ఒక్క పామును చూస్తేనే మనం భయపడిపోతాం. దగ్గరలో పాము ఉందనే వార్త వింటేనే ఆ వైపు వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం కదా.. అలాంటిది మనం రోజు పడుకునే బెడ్ కిందే ఏకంగా 18 పాము పిల్లలు కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే ఓ మహిళకు ఎదురైంది.. దీంతో సదురు మహిళ భయంతో వణికిపోయింది. ఈ షాకింగ్ ఘటన జార్జియాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ట్రిస్ విల్చర్ అనే మహిళ రాత్రి సమయంలో తన బెడ్ రూమ్ లో నిద్ర పోవడానికి బెడ్ ను సర్దుతున్న సమయంలో నేలపై ఏదో శబ్ధం వినిపించడంతో దగ్గరగా వెళ్లి చూసింది. ఈ క్రమంలో ఆ మహిళకు పాము కనిపించడంతో ఒక్కసారిగా భయంతో కేకలు వేసింది. ఆమె కేకలు విన్న.. మహిళ భర్త రూమ్ లోపలకి వచ్చి పాము పిల్లను చూసాడు. దీంతో బెడ్‌ను తీయగా వారికి ఏకంగా 18 పాము పిల్లలు కనిపించాయి. ఓ పాము బెడ్ కింద పిల్లల్ని కనడంతో అవి అక్కడ ఉన్నాయి. ఎంతో డేర్ చేసి.. మహిళ భర్త ఓ సంచిలో వేసి సమీపంలోని అడవిలో వదిలేశారు.

Advertisement

Next Story

Most Viewed