పరకాలలో టెన్షన్ టెన్షన్.. ఏ క్షణాన ఏం జరుగుతుందో

by Shyam |   ( Updated:2021-08-01 00:33:19.0  )
పరకాలలో టెన్షన్ టెన్షన్.. ఏ క్షణాన ఏం జరుగుతుందో
X

దిశ ,పరకాల: జిల్లా సాధన ఉద్యమం దిన దినం ఉత్కంఠగా మారుతుంది. అధికార పార్టీ నేతలు, జిల్లా సాధన ఉద్యమానికి చెందిన అఖిలపక్ష నేతల మధ్య బాహాబాహీగా మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీల నేతల్లారా ఖబర్దార్ అని అధికార పార్టీ నేతల హెచ్చరిస్తే. బెదిరింపులకు భయపడేది లేదు అంటూ జిల్లా సాధన సమితి నాయకులతోపాటు అఖిలపక్ష నేతలు సవాల్ విసురుతున్నారు. తీరా మాటల యుద్ధం కాస్త పోటాపోటీ కార్యక్రమాలకు తెరతీసింది. అందులో భాగంగా ఆదివారం టీఆర్ఎస్ నేతలు పరకాల అంబేద్కర్ సెంటర్ నుంచి శాంతి ర్యాలీ నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు. ఇదే క్రమంలో పరకాల జిల్లా సాధన కోసం అమరవీరుల జిల్లా సాధన సమితి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో 20 రోజు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ కి సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష అధికార పార్టీ నేతల మధ్య ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆత్మకూర్, శాయంపేట, పరకాల సీఐలు ఎస్ఐలతో పరకాల పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఏమి జరగనుందో అనే సందేహంతో ప్రజలు టెన్షన్ టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు.

Advertisement

Next Story